
శ్రీకాళహస్తిలో ప్రధాన ఆలయమైన శ్రీకాళహస్తేశ్వర స్వామి ఆలయం చోళరాజుల కాలం నాటిది. ఎన్నో శతాబ్దాల క్రితం తమిళ కవి నక్కీరన్ తన రచనలలో ఈ ఆలయం గురించి వ్యాఖ్యానించాడు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయంలో 100 స్థంభాల మండపాన్ని నిర్మించాడు.
పౌరాణికం : పురాణాలలో కూడా శ్రీకాళహస్తి ఆలయ మహిమను ఉటంకించారు. ఈ దేవుడు పార్వతికి శాపవిమోచనం కల్పించి జ్ఞానం ప్రసాదించి జ్ఞానప్రసూనాంబగా తీర్చిదిద్దాడు. ఒకప్పుడు ఈశ్వరునికి పార్వతిపై కోపం వచ్చి మానవ కాంతగా జన్మించమని శపించాడు. తర్వాత శ్రీకాళహస్తిలో తపస్సు ఆచరించి శ్రీకాళహస్తీశ్వరుని కృపకు పాత్రురాలు కావాలని ఆదేశించాడు. పార్వతి తపస్సు చేసి, శ్రీకాళహస్తీశ్వరుని పూజించి శాప విముక్తి పొందిందని ఐతిహ్యం.