శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, కదిరి - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Friday, 1 September 2017

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, కదిరి

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, కదిరి
 


దుష్ట సంహారనికై మహా విష్ణువు అవతారాలు ఎత్తడం, దుష్టసంహారం కావించిన తర్వాత ,అవతారం చాలించడం పరిపాటి. ఒకప్పుడు భూలోకంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు మానవాళిని, దేవగణాన్ని చిత్రహింసలకు గురిచేయడంతో, అతని సంహారానికై విష్ణువు అవతారమెత్తవలసి వచ్చింది. ఆ రాక్షసుడికి వివిధ రకాల వరాలు ఉన్నకారణంగా విష్ణువు యుక్తిగా నరసింహావతారం ఎత్తాడు. ముఖం సింహం, దేహం మానవ శరీరం - ఇది నరసింహస్వామి ఆకారం. ఆ దానవ సంహారం తర్వాత స్వామి స్థిరపడ్డ స్థలం కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంగా ప్రాశస్త్యం పొందింది నరసింహస్వామి హిరణ్యkkakaకశిపుడిని కదిరి సమీపంలోని గొడ్డువెలుగుల దుర్గంలో సంహరించినట్లు ఐతిహ్యం. కదిరికి మునుపు పేరు ఖాద్రి.
ఖ అంటే విష్ణుపాదం అని అద్రి అంటే కొండ అని విశ్లేషణ. ఖ అనునది ఒక మల్బరీ జాతి చెట్టు అని, ఆ చెట్టు వేర్ల నుండి స్వామి స్వయంభువుగా అవతరించాడని ప్రతీతి. ఈ కొండ స్తోత్రాద్రిగా పేరుపొందినదని చెబుతారు. వసంత ఋతువు కాలంలో విగ్రహ ప్రతిష్ట జరిగిన కారణంగా ఇక్కడి దేవుడిని వసంతవల్లభుడుగా కూడా పిలుస్తారు. ఆలయంలో శ్రీలక్ష్మి విగ్రహ కూడా ప్రతిష్ట జరిగింది.
పురాణాల ప్రకారం కదిరి నరసింహస్వామి ఆలయ ఉత్సవ మూర్తులను నిత్యపూజలకై స్వామి స్వయంగా బృగుమహర్షికి అందజేసినట్లు ప్రతీతి. సమీపంలోని మద్దిలేరు నది వద్ద అర్జునుడు తపస్సు చేసిన కారణంగా ఆ నదిని అర్జున నది అని కూడా పిలిస్తారు. బ్రహ్మపురాణంలో కదిరికి సంబంధించిన పెక్కు అంశాలు పేర్కొనబడినాయి.
కదిరి ఆలయ రథోత్సవం విశిష్టంగా జరుగుతుంది. దక్షిణాదిలోని అన్ని ఆలయ రథముల కంటే కదిరి రథం అత్యంత బరువైనదని వివరాలు వెల్లడిస్తున్నాయి.
కదిరి ఆలయంలో మరో విశిష్టత లేదా విచిత్రం ; అభిషేకం తర్వాత స్వామి విగ్రహాన్ని అర్చకులు తెరిపి లేకుండా వస్త్రంతో తుడుస్తున్నప్పటికీ విగ్రహం నుండి చెమట కారుతూనే ఉంటుంది.
చారిత్రకంగా చూస్తే ఆలయంలో పెక్కు శాసనాలు లభ్యమవుతున్నాయి. విజయనగర రాజుల కాలంలో రెండవ బుక్కరాయల పాలనలో 1332వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది.
పూజలు: ఉ. 6.30 నుండి మ. 12.45 వరకు. సా. 4.30 నుండి రా. 8.30 వరకు
అడ్రస్సు: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, కదిరి - 515 591, అనంతపురం జిల్లా, ఫోన్: 099867 26612