హార్వర్డ్ సిలబస్‌లో రామాయణ, భారతాలు!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి హార్వర్డ్ యూనివర్సిటీలో రామాయణ, మహాభారతాలను బోధించనున్నారు. భారతీయ మత గ్రంథాల ద్వారా రచనా సాహిత్యాల బోధన అనే అంశాన్ని సిలబస్‌లో చేర్చినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకురాలు యానీ ఈ. మోనియస్ తెలిపారు. అన్నే మోనియస్ హార్వర్డ్‌లో దక్షిణాసియా మతాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. రామాయణ, మహాభారత ఇతిహాసాల్లో శ్లోకాల రూపంలో వర్ణించిన మత పరిస్థితులను ఈ సిలబస్‌లో చేర్చినట్లు ఆమె తెలిపారు. వేద వ్యాసుడు, వాల్మీకి చెప్పిన విషయాలను ఆధునిక మత పరిస్థితులకు అనుసంధానించి విద్యార్థులకు బోధిస్తారు. భారతీయ ఇతిహాసాలలో ప్రతి అంశం మానవ జీవితానికి సంబంధించిన దీర్థ, సంక్లిష్టమైన కథనాలు.....భారతీయ పురాణాలు మానవ అనుభవం యొక్క దాదాపు ప్రతి అంశాలతో మాట్లాడే దీర్ఘ మరియు సంక్లిష్ట కథనాలు. ద్వేషం, యద్ధం వల్ల కలిగే నష్టాలను మహాభారతం హుందాగా వివరిస్తే, రామాయణం భారతదేశం ప్రేమ కథలలో ఒకటని ఆమె అన్నారు.
అనేక మంది పరిశోధకులు శతాబ్దానికి పైగా రామాయణ, మహాభారతాలను తాత్విక, లేఖన గ్రంథాలుగానే అధ్యయనం చేశారు... అయితే భారతీయ సాహిత్య సంపదను ఉపఖండంలో ఎక్కువగా విస్మరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ రెండు ఇతిహాసాలు గతంలోనూ, ఇప్పుడూ చుట్టూ ఉన్న సరిహద్దులను సులభంగా అధిగమించాయని యానీ అన్నారు. కేవలం రామాయణ మహాభారతాలనే కాదు, వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు కూడా ఆధునిక విధానంలో బోధించనున్నారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత వీటి గొప్పదనాన్ని అభినందించకుండా ఉండలేరని ఆమె వ్యాఖ్యానించారు. ఈ గ్రంథాల గొప్పతనాన్ని అభినందించడానికి, పలురకాలుగా వీటిని అభివృద్ధి చేసి, హిందూ మత సంప్రదాయాలను కొత్త పుంతలు తొక్కిస్తారని యానీ ఆశాభావం వ్యక్తం చేశారు.