దశమి - శ్రీరాజరాజేశ్వరి - చిత్రాన్నం (30-09-17)
అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్ దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||
రాజరాజేశ్వరి గాయత్రి : రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్||
అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి.
సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. "ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. లడ్డూలు నివేదన ఇవ్వాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది.
ప్రసాదం: చిత్రాన్నం (పులిహోర)
కావాలసిన పదార్ధాలు :
1. బియ్యం : అరకిలో
2. నూనె : 1 కప్పు
3. చింత పండు గుజ్జు : 1 కప్పు
4. పోపు దినుసులు : అరకప్పు
5. అంటే (ఆవాలు, మినపప్పు, సెనగపప్పు,వేరు సెనగ పప్పులు)
6. ఎండుమిర్చి : నాలుగు
7. కరివేపాకు : మూడు రెమ్మలు
8. పచ్చిమిర్చి : మూడు
9. పసుపు : 1 టేబుల్ స్పూన్
10. ఉప్పు : సరిపడ
11. ఆవపిండి ముద్ద : 1 టేబుల్ స్పూన్
(కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు)
తయారుచేయు విధానం :
1) ముందుగా అన్నం పొడిపొడిగా వండి ప్లేటు లోకి తీసి చల్లార్చాలి.
2) ఇప్పుడు చింత పండు నానపెట్టి, గుజ్జు తియ్యాలి.
3) దీనిలో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి చీలికలు వేసి స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టాలి. ఇది దగ్గరగా ఉడికి ముద్దలా వస్తుంది దీనిని దించి పక్కన పెట్టాలి.
4) ఇప్పుడు స్టవ్ పై బాండిపెట్టి నూనెపోసి పోపుదినుసులు వేసి వేగాక,ఎండుమిర్చి వేసి వేగిన తరువాత కరివేపాకు వేసి స్టవ్ ఆపాలి.
5) ఇప్పుడు అన్నంలో ఉడకబెట్టిన చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి.
6) అన్నమంతా కలిసిన తరువాత, వేగిన పోపు వేసి అన్నం మొత్తం కలపాలి.
* అంతే చింతపండు పులిహోర రెడి.