నవమి - మహిషాసురమర్ధని - పాయసాన్నం, పులిహోర (29-09-17) - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Saturday, 9 September 2017

నవమి - మహిషాసురమర్ధని - పాయసాన్నం, పులిహోర (29-09-17)





నవమి - మహిషాసురమర్ధని - పాయసాన్నం, పులిహోర (29-09-17)










జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే
మహిషాసుర మర్ధిని గాయత్రి : మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి -  తన్నో మాతా ప్రచోదయాత్‌||

మహిసాసురమర్దిని 
సమాజంలో బయటి ప్రపంచంలో మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులు ఎన్నో.అవసరమైతే అలాంటి ఇబ్బందును ఎదుర్కొనేందుకు పోరాటం సాగించాలని చెప్పే అవతారమే మహిసాసురమర్దిని అవతారం.

పాయసాన్నం
కావల్సినవి:
  బియ్యం- అరకప్పు, చక్కెర - ముప్పావుకప్పు, నెయ్యి- మూడు టేబుల్‌ స్పూన్లు, పాలు- రెండుకప్పులు, జీడిపప్పు- మూడు చెంచాలు.
తయారీ:
కుక్కర్‌లో కడిగిన బియ్యం, ఒకటిన్నర కప్పు పాలు, కాస్త నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేయాలి. ఈ అన్నాన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి మిగిలిన పాలూ, చక్కెర వేయాలి. చక్కెర కరిగి కాస్త పల్చగా అయ్యేవరకూ మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. ఇంతలో ఓ బాణలిలో మిగిలిన నెయ్యి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక జీడిపప్పు వేయించి పొయ్యి కట్టేయాలి. పాలు కాస్త ఆవిరవుతున్నప్పుడు జీడిపప్పూ, నెయ్యిని అందులో వేసి దింపేయాలి.

పులిహోర

కావలసినవి
బియ్యం: అరకిలో, చింతపండు: 100 గ్రా, ఎండుమిర్చి: 25, సెనగపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: 2 టేబుల్‌స్పూన్లు, ఆవాలు: టీస్పూను, ఇంగువ: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: టీస్పూను, నువ్వులనూనె: 200 గ్రా, దనియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: అరటీస్పూను, మెంతులు: అర టీస్పూను, వేరుసెనగపప్పు లేదా జీడిపప్పు(రెండూ కలిపి కూడా వేసుకోవచ్చు): 50 గ్రా, కరివేపాకు: 10 రెబ్బలు
తయారుచేసే విధానం


* అన్నం ఉడికించి టేబుల్‌స్పూను నువ్వులనూనె వేసి చల్లార్చాలి.
* చింతపండులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టి చిక్కని గుజ్జు తీయాలి. ఓ చిన్న బాణలిలో మెంతులు వేసి వేయించి పొడి చేయాలి.
* మరో బాణలిలో నువ్వుల నూనె వేసి కాగాక, పప్పులు, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు అన్నీ వేసి వేయించాలి. తరవాత చింతపండు గుజ్జు వేసి సిమ్‌లో ఉడికించాలి. తరవాత కరివేపాకు రెబ్బలు, ఇంగువ, ఉప్పు కూడా వేసి ఉడికించాలి. చింతపండు గుజ్జు దగ్గరగా ఉడికిన తరవాత స్టవ్‌మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు అందులో మెంతిపొడి వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని ఉడికించి చల్లార్చిన అన్నంలో వేసి కలపాలి. అన్నం చల్లార్చేటప్పుడు మరో టేబుల్‌స్పూను నువ్వుల నూనె వేసి కలిపితే మరింత రుచిగా ఉంటుంది.