పద్మాసనం
మనసును ఏకాగ్రతతో ఉంచాలనుకుంటే పద్మాసనం చాలా ఉత్తమమైనది. పద్మ అంటే కమలం, కాబట్టి ఈ ఆసనానికి కమలాసనం అనికూడా అంటారు.
![]() |
పోతురాజు.సతీష్ |
దీనివలన లాభాలు:- "ఇదం పద్మాసన ప్రోక్తంసర్వవ్యాధి వినాశనం" అంటే పద్మాసనం వలన సమస్త రోగాలు నాశనం అవుతాయి. సమస్త రోగాలు అంటే దైవికంగా, దైహికంగా, భౌతిక పరమైన వ్యాధులు అని అర్థం.పద్మాసనంలో ప్రాణాయామం చేస్తే సాధకుడు లేక రోగి ఆత్మ ప్రశాంతంగావుంటుందని యోగా నిపుణులు తెలిపారు. ధ్యానం చేసేవారికి ఈ ఆసనం ఎంతో శ్రేష్టమైందని వారు పేర్కొన్నారు.జాగ్రత్తలు: ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళల్లో నొప్పులు అధికమైనప్పుడు ఆసనాన్ని నిలిపివేయడం ఉత్తమం అంటున్నారు యోగా గురువులు.