ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే - తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ - సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ నవమా సర్వస్థిశ్చేత్ నవదుర్గా ప్రకీర్తితా||
దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్

విద్యుద్దామ సమప్రభాం
మృగపతి స్కందస్థితాం భీషణా౦
కన్యాభి: కరవాలఖేల
విలద్దస్తా భిరాసేవితాం!
విలద్దస్తా భిరాసేవితాం!
హసైశ్చక్రగదాసిఖేట
విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం
దుర్గం త్రినేత్రం భజే
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. "ఓం దుం దుర్గాయైనమ:" అనే మంత్రం పఠించాలి.

ప్రసాదం: చక్రపొంగలి,శాకాన్నం
చక్ర పొంగలి
కావలసిన పదార్థాలు :
బియ్యం -గ్లాసు,
పెసరపప్పు -పావు గ్లాసు
నేతిలో వేయించిన జీడిపప్పు,ఎండుద్రాక్ష పలుకులు-పావుకప్పు
బెల్లం -రెండు కప్పులు,
పాలు -గ్లాసు,
యాలకుల పొడి -అరచెంచా
తయారుచేసే విధానం :
బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి రెండున్నర గ్లాసుల నీళ్లు చేర్చి మెత్తగా ఉడికించుకోవాలి. అందులో బెల్లం తురుము వేసి మరికాసిని నీళ్లు, పాలు చేర్చి మళ్లీ సన్ననిమంటపై పెట్టాలి. బెల్లం లేదా చక్కెర అందులో వేసి కరిగి పొంగలి దగ్గరగా అవుతున్నప్పుడు యాలకులపొడి చల్లుకోవాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష పలుకులను నేతిలో దోరగా వేయించి అందులో కలపాలి. దించేముందు పైన కొద్దిగా నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది.

శాకాన్నం
కావల్సినవి:
అన్నం - కప్పు, క్యారెట్, బీన్స్ ముక్కలు - రెండూ కలిపి పావుకప్పు, పచ్చిబఠాణీ - రెండు చెంచాలు, క్యాప్సికం, వంకాయ, బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున, బెండకాయలు - రెండు, చిక్కుడుకాయలు - రెండు, జాజికాయపొడి - అరచెంచా, జాపత్రి పొడి - పావుచెంచా, యాలకులు - మూడు, లవంగాలు - నాలుగు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, నెయ్యి - పావుకప్పు, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు.
తయారీ:
కూరగాయ ముక్కలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అవి మరీ మెత్తగా కాకుండా ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద గిన్నెపెట్టి నెయ్యి కరిగించాలి. అందులో జాజికాయపొడి, జాపత్రిపొడి, యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్కపొడీ వేసి వేయించుకోవాలి. నిమిషమయ్యాక కూరగాయముక్కలన్నింటినీ వేసేయాలి. అవి వేగాక కరివేపాకు, అన్నం, తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకుని తీసుకుంటే చాలు.