సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - రవ్వ కేసరి (27-09-17) - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Saturday, 9 September 2017

సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - రవ్వ కేసరి (27-09-17)

సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - రవ్వ కేసరి (27-09-17)




సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||
సరస్వతీ గాయత్రి : సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి -  తన్నో వాణీ ప్రచోదయాత్‌||

''యా కుందేందు తుషారహార
దవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత
కరా యశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి
భిర్దేవైస్సదా పూజితా
సమాంపాతు సరస్వతీ భగవతీ

నిశ్శేష జాడ్యాపహా"

నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున అమ్మ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి. ఈమె బ్రహ్మ చైతన్యంతో హంసవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి, చతుష్షష్టి కళలను అనుగ్రహించినది సరస్వతీ దేవి. సంగీత రస స్వరూపమైన నెమలి వాహనంగా, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను, వీణను రెండు చేతులతో ధరించి , చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధి ప్రదాయిని, వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి.

ప్రసాదం:

ర‌వ్వ‌కేస‌రి


టేస్టీ ర‌వ్వ‌కేస‌రి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం…

images (1)
కావాల్సిన ప‌దార్థాలు:
ఉప్మా ర‌వ్వ లేదా బొంబాయి ర‌వ్వ – 1క‌ప్పు
పంచ‌దార – 2 క‌ప్పులు
నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు
యాల‌కుల పొడి – అర స్పూన్
జీడిప‌ప్పు – 10
కిస్మిస్ – 10
నీళ్లు – 4 క‌ప్పులు
త‌యారు చేసే విధానం:
1. ముందుగా నెయ్యి పాన్‌లో వేసి.. వేడ‌య్యాక డ్రై ఫ్రూట్స్ వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి.
2. అదే పాన్‌లో ర‌వ్వ‌ను కాస్త వేయించుకోవాలి.
3. మ‌రొక గిన్నె తీసుకుని నీళ్లు మ‌ర‌గ‌బెట్టాలి.
4. నీళ్లు ఉడుకుప‌ట్టాక ర‌వ్వ వేసి.. బాగా క‌ల‌పాలి. లేదంటే ఉండ‌లు క‌డుతుంది.
5. ర‌వ్వ కాస్త మెత్త‌బ‌డిన త‌ర్వాత పంచ‌దార క‌ల‌పాలి. చిక్క‌గా వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. ర‌వ్వ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. నెయ్యి, కేస‌రి క‌ల‌ర్, డ్రై ఫ్రూట్స్ క‌లపాలి. ఇప్పుడు యాల‌కుల పొడి క‌లిపి.. వేడి వేడి ఆర‌గించండి.