షష్ఠి - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం (26 -09-17) - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Saturday, 9 September 2017

షష్ఠి - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం (26 -09-17)

షష్ఠి - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం (26 -09-17)





మాతర్నమామి కమలే కమలాయతాక్షి -  శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః క్షీరదజే కమల కోమల గర్భగౌరి -  లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||
  లక్ష్మీ గాయత్రి :  ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి -  తన్నో దేవి ప్రచోదయాత్‌|| "ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి -  తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌||"  అని పఠించినా మంచిది.

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం
లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ద
విభవద్ర్భాహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలిక్య కుటుంబినీం
సరసిజాం వందే ముకుంద ప్రియాం

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మన్మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవిసర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి."యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" అంతే అన్ని జీవులలోనో ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి.

ప్రసాదం: గుడాన్నం

గుడాన్నం

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 2 కప్పులు
వేయించిన పెసరపప్పు -- 1/2 కప్పు
బెల్లంకోరు -- 4 కప్పులు
నెయ్యి -- 1కప్పు
ఏలకుల పొడి -- 1 స్పూన్
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 25 గ్రాములు

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బియ్యం, పెసరపప్పు కలిపి కుక్కర్ లో మెత్తగా ఉడికించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసి మెత్తగా గరిటతో కలుపుతూ స్టవ్ మీద సన్నని మంటపై, ఉడికించితే, బెల్లం అంతా కరిగి మెత్తగా పాకంలాగా వస్తుంది. ఇది ఉడికే లోపున....వేరే స్టవ్ మీద చిన్న పాత్రలో నెయ్యి వేసి, వేడిచేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు దోరగా వేయించి, చక్కర పొంగలిలో వేసి, ఏలకుల పొడి వేసి కలిపి దగ్గరగా అయిన తరవాత, దించుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన తియ్యని గుడాన్నం రెడీ.