పంచమి - శ్రీ లలితా దేవి - కొబ్బరి అన్నం, దద్దోజనం (25 - 09 - 2017) - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Saturday, 9 September 2017

పంచమి - శ్రీ లలితా దేవి - కొబ్బరి అన్నం, దద్దోజనం (25 - 09 - 2017)


పంచమి - శ్రీ లలితా దేవి - కొబ్బరి అన్నం, దద్దోజనం (25 - 09 - 2017)

అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ -  ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||
శ్రీలలితా గాయత్రి : లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్‌||



శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి - ఐదవ రోజు
ప్రాత: స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - ఐదవ రోజు
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం

మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్
త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. 

కొబ్బరి అన్నం 

కావలసిన పదార్థాలు:--

బియ్యం -- 1/2 కేజీ
కొబ్బరి తురుము -- 4 కప్పులు
జీడిపప్పు -- 50 గ్రాములు
నెయ్యి -- 50 గ్రాములు
ఏలకులు -- 4
లవంగాలు -- 4
దాల్చినచెక్క -- 4 ముక్కలు
పచ్చిమిర్చి -- 5 (చీలికలు చేసుకోవాలి) 
కరివేపాకు -- తగినంత
పల్లీలు -- 4 స్పూన్స్
ఉప్పు -- తగినంత

తయారీవిధానము:--
ముందుగా బియ్యం కడిగి పక్కన ఉంచుకోవాలి,  కొబ్బరితురుమును మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసి, పాలను తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీడిపప్పు,  పల్లీలు, పచ్చిమిర్చి వేసి వేగిన తరవాత కొబ్బరిపాలు పోసి, కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసి, తగినంత ఉప్పు వేసి, మూతపెట్టి, ఉడికేంతవరకు ఉంచి, దించుకోవాలి. అంతే కమ్మని కొబ్బరి అన్నం రెడీ.



దద్దోజనం 
కావలసినవి: బియ్యం - అరకప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పులు, పెరుగు - ఒక కప్పు, పాలు - పావు కప్పు, పచ్చిమిర్చి(సన్నగా తరిగి) - రెండు, అల్లం (సన్నగా తరిగి)- ఒకటిన్నర టీస్పూన్‌, ఆవాలు - ముప్పావు టీస్పూన్‌, పచ్చి శెనగపప్పు - ముప్పావు టీస్పూన్‌, మినపప్పు - అర టీస్పూన్‌, కరివేపాకులు - కొన్ని, ఇంగువ - చిటికెడు, నూనె - రెండు టీస్పూన్లు, ఎండుమిర్చి - రెండు. 
తయారీ:
బియ్యం శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. 
అన్నాన్ని గరిటెతో కొద్దిగా మెత్తగా చేయాలి. అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు పోసి కలిపి చల్లారనివ్వాలి. తరువాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. 
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, పచ్చి శెనగపప్పు, మినపప్పు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొన్ని సెకన్లు వేగించాలి. 
ఈ తాలింపును పెరుగన్నంలో వేసి కలపాలి. దానిమ్మ గింజలతో అలంకరించాలి.