చవితి - అన్నపూర్ణేశ్వరి - అల్లం గారెలు,గుడాన్నం (24-09-17)
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి|| మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
అన్నపూర్ణ గాయత్రి : అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి - తన్నో దేవి ప్రచోదయాత్||
ప్రసాదం:-
• కావలసినవి
మినప్పప్పు: 2 కప్పులు, అల్లం ముద్ద: 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: 2 టీస్పూన్లు, మిరియాలు: అర టీస్పూను, ఎండుకొబ్బరి తురుము: టీస్పూను, ఉప్పు: 2 టీస్పూన్లు, దాల్చినచెక్క: పావు అంగుళంముక్క, లవంగాలు: రెండు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
• తయారుచేసే విధానం
మినప్పప్పుని ముందుగానే నానబెట్టాలి. ముందుగా నానబెట్టిన మినప్పప్పు మినహా మిగిలినవన్నీ వేసి బాగా రుబ్బాలి. తరవాత అందులోనే మినప్పప్పు కూడా వేసి రుబ్బుకోవాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గారెలు చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని ఏదైనా చట్నీతో వడ్డించండి.

"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాత్ మోక్షకరీసదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"
దసరా ఉత్సవాలలో అమ్మవారిని ఆశ్వియుజ చవితి రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ. అన్నపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయ స్ఫూర్పి, వాక్ సిద్ది, శుద్ధి, భక్తీ శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. సర్వ లోకాల పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుంది.
అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.

అల్లం గారెలు
మినప్పప్పు: 2 కప్పులు, అల్లం ముద్ద: 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: 2 టీస్పూన్లు, మిరియాలు: అర టీస్పూను, ఎండుకొబ్బరి తురుము: టీస్పూను, ఉప్పు: 2 టీస్పూన్లు, దాల్చినచెక్క: పావు అంగుళంముక్క, లవంగాలు: రెండు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
• తయారుచేసే విధానం
మినప్పప్పుని ముందుగానే నానబెట్టాలి. ముందుగా నానబెట్టిన మినప్పప్పు మినహా మిగిలినవన్నీ వేసి బాగా రుబ్బాలి. తరవాత అందులోనే మినప్పప్పు కూడా వేసి రుబ్బుకోవాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గారెలు చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని ఏదైనా చట్నీతో వడ్డించండి.
గుడాన్నం
కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 2 కప్పులు
వేయించిన పెసరపప్పు -- 1/2 కప్పు
బెల్లంకోరు -- 4 కప్పులు
నెయ్యి -- 1కప్పు
ఏలకుల పొడి -- 1 స్పూన్
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 25 గ్రాములు
తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బియ్యం, పెసరపప్పు కలిపి కుక్కర్ లో మెత్తగా ఉడికించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసి మెత్తగా గరిటతో కలుపుతూ స్టవ్ మీద సన్నని మంటపై, ఉడికించితే, బెల్లం అంతా కరిగి మెత్తగా పాకంలాగా వస్తుంది. ఇది ఉడికే లోపున....వేరే స్టవ్ మీద చిన్న పాత్రలో నెయ్యి వేసి, వేడిచేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు దోరగా వేయించి, చక్కర పొంగలిలో వేసి, ఏలకుల పొడి వేసి కలిపి దగ్గరగా అయిన తరవాత, దించుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన తియ్యని గుడాన్నం రెడీ.