మహా శివరాత్రి మహోత్సవ ఆహ్వానం - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Saturday, 16 February 2019

మహా శివరాత్రి మహోత్సవ ఆహ్వానం






భక్త మహాశయులకు ముఖ్య విజ్ఞప్తి:-

                        2019 మార్చి 4,5 తేదీలు అనగా సోమవారం,మంగళవారం రెండు రోజులు కూడా సప్త బాలయోగిలలో ఒకరైన,గత 44 సంవత్సరాలుగా తపస్సు చేస్తూ సజీవంగా దర్శనం ఇస్తున్న భగవాన్ శ్రీ శ్రీ శ్రీ నందివాడ బాలయోగీశ్వరుల వారి దివ్య దర్శనం భక్తులు ఏవన్మందికీ లభించును గాన భక్తులేవన్మందీ విచ్చేసి స్వామి వారిని దర్శించి,అటు పిమ్మట శ్రీ బాలయోగి ఆశ్రమ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి పాదరస శివలింగాన్ని, భవానీ అమ్మవారిని దర్శించి తరించ ప్రార్థన.
భగవాన్ బాలయోగీశ్వరులవారు



పాదరస శివలింగం




ఆశ్రమ ప్రాంగణంలోని దుర్గా భవానీ అమ్మవారు

స్వామి వారి జీవిత చరిత్ర(సంక్షిప్తముగా):-




               శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం నందివాడ అనే చిన్న పల్లెటూరు కలదు.ఆ గ్రామము లో పుట్టిన శ్రీ పిసిసి సత్యం, సూరమ్మ దంవతులకు మొత్తం 11 మంది సంతానం.దైవభక్తి పరులైన ఆ పుణ్య దంపతులకు సంతానంలో సప్తమ గర్బవాసునిగా ఆదినారాయణ జన్మించాడు.అతడే మన నందివాడ బాలయోగి.తల్లిదండ్రులు బాలుడికి ఆదినారాయణ అను నామకరణం చేయుటకు పూర్వం తల్లి సూరమ్మకు తాను గర్బవతిగా ఉండగా ఒకనాడు స్వప్నం లో శ్రీ వైకుంఠవాసుడైన శ్రీ మన్నారాయణుడు శంఖు, చక్రగదాదారియై అభయహస్తంతో ఓ బాలుని రూపమున ఆ పుణ్యవతి గర్భమున జన్మించినట్లు శుభస్వప్నం కలిగింది.






తదుపరి శ్రీ జయనామ సంవత్సరం ఆషాడ శుక్ల సప్తమీ బుధవారం హస్తా నక్షత్రం అనగా 7-7-1954 వ సంవత్సరమున పుత్ర జననమైనది.ఈ కారణంగా బాలునికి ఆదినారాయణ అని నామకరణం చేసారు. ఆదీనారాయణ తన 16వ ఏట ఒక మహాశివరాత్రి పర్వధినమున శ్రీ ముమ్మిడివరం బాలయోగీశ్వరులవారిని దర్శించిన పిదప దైవ సంకల్పంతో తనలో అనూహ్యమైన మార్పు కలిగి దృడ సంకల్పంతో తన స్వగ్రామమైన నందివాడ చేరి అదే సంవత్సరమున 1975న శ్రీ రామనవమి పర్వధినమున తపస్సునకు కూర్చుండిరి.నాటి నుండి నేటి వరకు అఖండముగా తపస్సు కొనసాగించుచున్నారు. ప్రతి యేటా మహాశివరాత్రి, ఆ మరుసటి రోజు భక్తుల కోరిక మీర భక్తకోటికి దర్శనం యిస్తున్నారు.


కార్యక్రమములు:-

04-03-2019 ది మహాశివరాత్రి సోమవారం ఉదయం 4గం నుండి పాదరస శివలింగమునకు సుప్రభాతం,నమకం,చమకం,శతరుద్రీకరణం,రుద్రాభిషేకం, శ్రీ దుర్గాభవాని అమ్మవారికి శ్రీసూక్తయుత కుంకుమ పూజలు, గో పూజ జరుగును అనంతరం ఉదయం 8గం,, నుండి భగవాన్ శ్రీ బాలయోగీశ్వరుల వారి,పాదరశ శివలింగ మరియు శ్రీ భవానీ అమ్మవారి దర్శనములు ప్రారంభమగును.


గీతా పారాయణం,భజన :-



శ్రీ రామకృష్ణా భక్తబృందం, ఇప్పిలి, బలరాంపురం వారిచే గీతాపారాయణ,భజన కార్యక్రమములు జరుపబడును.


నారాయణ సేవ:- 




మార్చి 4,5 తేదీలు సోమవారం,మంగళవారం రెండురోజులు కూడా శ్రీ బాలయోగీశ్వరుల అన్నదాన సంఘం వారిచే భక్తకోటికి నారాయణ సేవ(అన్నదానం) మహాయజ్ఞం జరుపబడును.

ఈ "అన్నదాన కార్యక్రమం" దాతల సహాయంతో జరుగుచున్నది కావున ధన,వస్తు,సేవ రూపేన పాల్గొని తరించ ప్రార్థన.

వేదాంత ఉపన్యాసములు:-





మహాశివరాత్రి 12 గం,, ల నుండి 3గం,, ల వరకు శ్రీకాకుళం జిల్లా గార మండలం గార వాస్తవ్యులు బ్రహ్మశ్రీ జగదానంద స్వాముల వారు వేదాంత ప్రవచనములు అనుగ్రహింతురు. శ్రీకాకుళం జిల్లా , పొందూరు మండలం, లయిదాం గ్రామం శ్రీ శివానంద దర్మక్షేత్రం సంస్థాపకులు రామయోగి వారి శిష్యులు, బ్రహ్మజ్ఞానులైన శ్రీ ప్రకాశానంద స్వామీజీ వారు మహాశివరాత్రినాడు మద్యాహ్నం 3గం,, లనుండి వేదాంత ప్రవచనములు చేయుదురు.


సంగీత గాన కచేరి:-




తే 05-03-2019 ది మంగళవారం మద్యాహ్నం 3గం,, నుండి విశాఖ ప్రేమా ఎయిడెడ్ హైస్కూల్ ఉపాద్యాయిని సంగీత విద్వాంసురాలు శ్రీ నామాన లక్ష్మణరావు గారి భార్యామణి శ్రీమతి ఉషాదేవి గారి సంగీత గాన కచేరీ జరుపబడును.

ముఖ్య గమనిక:-

04-03-2019 మహాశివరాత్రి నాడు ఉదయం 9గం,, నుండి 108 మంది దంపతులచే రుద్రాభిషేక కార్యక్రమం, మద్యాహ్నం 4 గం,, నుండి సూక్త హోమములు, సాయంత్రం 7గం,, నుండి "పార్వతీ కళ్యాణం" ,రాత్రి 12గం,, లకు లింగోద్భవ కార్యక్రమములు

అతిరుద్రయాగ కర్త బ్రహ్మశ్రీ ధర్మపురి గౌరీశంకర శాస్త్రి గారి ఆద్వర్యంలో...

ఆలయ అర్చకులు శ్రీ బంకుపల్లి బుచ్చిబాబు శర్మ గారి పర్యవేక్షణలో జరుపబడును.
పై కార్యక్రమములలో పాల్గొన దలచిన వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :- 9493469576(click to call)

మనవి

ఉదారులైన భక్తులకు దాతలకు ముఖ్య గమనిక :
శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆలయం ప్రక్కన శివాలయం నిర్మాణం చేయుచున్నాము.గాన దాతలెవరైనా ధన వస్తు సేవ రూపేనా సహకరించి పరమేశ్వరుని కృపకు పాత్రులు కాలగలరని ప్రార్థిస్తున్నాము.దాతల పేర్లు శాశ్వతముగా శిలాఫలకము వేయించి ఆలయంలో స్థాపించబడును.వివరాలకు బాలయోగి ట్రస్టు వారిని సంప్రదించగలరు.


ఇట్లు        
   
కలిశెట్టి సీతారాం గారు
ట్రస్ట్ ప్రెసిడెంట్
ఫోన్:- 9849429754(click to call)




శివ సత్యన్నారాయణ గారు
ట్రస్ట్ సెక్రరటరీ
9390219864(click)

Click to WhatsApp

కనకరాజు గారు
ట్రస్ట్ మెంబర్
9440074411(click)

Click to whatsapp
షణ్ముఖ సాయి
ట్రస్ట్ మెంబర్
6304229429(click)
Click to whatsapp