మహాలక్ష్మీ అమ్మవారు |
దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు మంగళవారం అమ్మవారు మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు సాక్షాత్కరించింది. మహాలక్ష్మీ దేవిని దర్శించుకుంటే ఐశ్వర్యప్రాప్తి, విజయం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మంగళవారం రాత్రి 9గంటల వరకూ జగన్మాత సేవలో భక్తులు తరించారు.ఉదయం కుంకుమ పూజల అనంతరం అమ్మవారికి ఇప్పిలి కనకరాజు దంపతుల చేతుల మీదుగా 9మంది ముత్తైదువులను నవదుర్గలగా మార్చి పూజించే సువాసినీ పూజ జరిగింది.సాయంత్రం హోమం నిర్వహించారు. నేడు అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. రేపటితో దసరా శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. రేపు ఉదయం మహిషాసురమర్దనిగా, మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ ఒకే రోజు రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. ఉత్సవాల ఆఖరి రోజు గురువారం సాయంత్రం 6 గంటలకు ఆశ్రమ సమీపంలో ఉన్న చెరువులో తెప్పోత్సవం నిర్వహించనున్నారు.