లలితా సహస్రనామావళి(lalitha sahasranamavali) - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Wednesday, 20 September 2017

లలితా సహస్రనామావళి(lalitha sahasranamavali)


లలితా సహస్రనామావళి(lalitha sahasranamavali)



  






శ్రీ లలితా సహస్రనామం అత్యంత శక్తిమంతమైనదిగా ... మహా మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. 'బ్రహ్మాండపురాణం' లో ఉత్తరభాగంలో లలితా సహస్రనామావళి విశిష్టత కనిపిస్తుంది. దీనిని మొదటిసారిగా హయగ్రీవ స్వామి ... అగస్త్య మహర్షికి బోధించాడు. ఆనాటి నుంచి కూడా లలితా సహస్రనామం తనని విశ్వసించిన వారిని ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వస్తోంది. అందువల్లనే చాలామంది నిత్యం అమ్మవారి సహస్రానామావళిని చదువుతూ వుంటారు.

ఇక విశేషమైన పుణ్యతిథులలో లలితను చదివే వారి సంఖ్య కూడా ఎక్కువగానే వుంటుంది.ఈ నేపథ్యంలో లలితా సహస్రనామం అందరూ చదవవచ్చునో లేదోననే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. మరికొందరు లలితను చదవడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియక సతమతమైపోతుంటారు. 

శుచిగా వున్నవారు ఎవరైనా సరే లలితను చదవవచ్చు. అశుచిగా వున్న సమయంలో అమ్మవారికి సంబంధించిన సహస్రనామాలు ... పారాయణాలు చేయాకూడదు. ఇక ఎలాపడితే అలా ... ఎక్కడ పడితే అక్కడ లలితను చదవకూడదు. ఒక నిర్ధిష్టమైన సమయం ... పవిత్రమైన ప్రదేశం అందుకు ఎంతో అవసరం. ఇక అన్నింటికీ మించి ఒకటికి పదిసార్లు లలితను చదివే తీరును పరిశీలించి, పలకడంలో ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. 

చాలామంది లలితను చదవడం వలన ఒకే విధమైన ఫలితం ఉంటుందని అనుకుంటారు. కానీ ఇందులోని ప్రతి పంక్తి ఒక్కో దోషాన్ని నశింపజేసి ... ఒక్కో పుణ్య ఫలాన్ని అందిస్తుంది. ఆరోగ్యం .. సంపద .. సంతానం .. ఇలా ఏది కావాలనుకుంటే అది పొందడానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ఆ పద్ధతులను పాటిస్తూ లలిత చదవడం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. లలితాదేవిని నిత్యం సహస్ర నామాలతో ఆరాధిస్తూ .. అర్చిస్తూ వుండటం వలన ఆ తల్లి అనుక్షణం కాపాడుతూ వుంటుంది .. కరుణిస్తూ వుంటుంది.
భక్తులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు.