దసరా శరన్నవరాత్రులు సందర్భంగా శ్రీ బాలయోగి ఆశ్రమం ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా భవాని అమ్మవారు
మొదటి రోజు సర్వాలంకార దుర్గా దేవి గా ,
![]() |
సర్వాలంకార దుర్గా దేవి |
రెండవరోజు బాలాత్రిపుర సుందరీ దేవిగా,
![]() |
బాలాత్రిపురసుందరీ దేవి |
మూడవ రోజు గాయత్రీ దేవి గా ,
![]() |
గాయత్రీ మాత |
అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.ఈ సందర్భంగా
ఇప్పిలి కనకరాజు-సంతోషిలక్ష్మి దంపతులు,
![]() |
కనకరాజు దంపతులు |
![]() |
సీతారాం దంపతులు |
![]() |
తిరుపతిరావు దంపతులు |
పూజా దంపతులు గా కూర్చున్నారు.మొదటి రోజు సర్వాలంకార దుర్గా దేవి ని దర్శించుకున్న భక్తులచే మరియు దంపతులచే ఉదయం కుంకుమ పూజలు, అమ్మవారికి అభిషేకం, సాయంత్రం హోమం మొదలయినవి రుత్వికులు...బంకుపల్లి బుచ్చిబాబు శర్మ మరియు వేమకోటి శశిభూషణశర్మ జరిపించారు.రెండవ రోజున అమ్మవారు బాలాత్రిపుర సుందరి దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు ..... విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు...ఈ సందర్భంగా అరసవల్లి దేవస్థానం పండితులు శ్రీ భాస్కరభట్ల చంద్రశేఖర శర్మ గారు సూర్యనమస్కారాలు వేయడం జరిగింది.తీర్ద ప్రసాదాలు భక్తులకు , దంపతులకు ,రుత్వికులకు అందించి అందరికీ ఆరోగ్యం కలిగేలా ఆశీర్వదించారు.
![]() |
భాస్కరభట్ల చంద్రశేఖర శర్మ |
అనంతరం బ్రహ్మ శ్రీ ఆరవిల్లి భాస్కరశర్మ గారిచే సాంగ నవావరణ శ్రీచక్రార్చన జరిగింది....
![]() |
ఆరవిల్లి భాస్కర శర్మ |
ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి , దంపతుల నుంచి విశేషమయిన స్పందన లభించింది.... ఒక్కమాటలో చెప్పాలంటే కార్యక్రమం న బూతో న భవిష్యత్ .... అమ్మవారి శ్రీ చక్రార్చన దాదాపు సాయంత్రం 3:30గం,, వరకు జరిగింది కానీ ఎక్కడా భక్తులలో అసహనం కానరాలేదు అంత అద్భుతంగా కార్యక్రమం జరిగింది. అమ్మవారికి ఆలయ అర్చకులు బుచ్చిబాబు శర్మ గారు అభిషేకం, కుంకుమ పూజలు, సాయంత్రం హోమం జరిపించారు.భక్తులకు శ్రీ బాలయోగి స్వామి వారిచే అమ్మవారి ప్రసాదం అందజేయటం జరిగింది.మూడవ రోజు అమ్మవారు గాయత్రీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు .... అమ్మవారికి అర్చన , కుంకుమ పూజలు, అభిషేకం వర్షం ఇబ్బంది పెట్టినా నిరాటంకంగా భక్తులచే,దంపతులచే జరిపించారు.సాయంత్రం 4గం. నుంచి చండీ హోమ కార్యక్రమం దంపతులచే వేమకోటి మోహన్ శర్మ గారు జరిపించారు.
అనంతరం మోహనశర్మ గారికి స్వామి వారి చేతుల మీదుగా చిరు సత్కారం జరిగింది.
![]() |
వేమకోటి మోహన్ శర్మ |
..పూజా కార్యక్రమంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా శ్రీ బాలయోగి స్వామి వారు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసారు.