బ్రహ్మ దేవాలయాలు - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Thursday, 7 September 2017

బ్రహ్మ దేవాలయాలు

బ్రహ్మ దేవాలయాలు


కమలంపై బ్రహ్మ
సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకడు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తూ తుడిచిపెట్టుకుని పోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు  

పుష్కర్ లోని బ్రహ్మదేవుడు

చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం.
బ్రహ్మదేవున్ని సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్థించినా, బ్రహ్మను పూజించే దేవాలయాలు చాలా తక్కువ. వీటిలోకెల్లా ప్రఖ్యాతిచెందినది అజ్మీర్ దగ్గరలోని పుష్కర్ వద్దనున్న బ్రహ్మ దేవాలయం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. వేలకొలదీ భక్తులు ఇక్కడి సరస్సులో పుణ్యస్నానాల కోసం వస్తారు. శ్రీకాళహస్తిలో బ్రహ్మకు దేవాలయం ఉంది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉంది. దీనిని ఖేతేశ్వర బ్రహ్మధామ్ తీర్థం అంటారు. తమిళనాడులోని కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూర్ లోను, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి. బ్రహ్మ దేవాలయాలన్నింటిలోకి పెద్దది కంబోడియా లోని ఆంగ్‌కోర్ వాట్దేవాలయం.