పాడ్యమి - శ్రీ సర్వాలంకృత దుర్గాదేవి - పులిహోర,గుడాన్నం (21-09-17) - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Saturday, 9 September 2017

పాడ్యమి - శ్రీ సర్వాలంకృత దుర్గాదేవి - పులిహోర,గుడాన్నం (21-09-17)

 
పాడ్యమి - శ్రీ సర్వాలంకృత దుర్గాదేవి - పులిహోర,గుడాన్నం (21-09-17)
సర్వాలంకృత దుర్గా దేవి
 దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. తొమ్మిది విధాలైన అనుష్ఠానాలు, విధి విధానాలతో తొమ్మిది రోజుల వ్రతదీక్ష చేపట్టిందని, ఆ శక్తి వల్ల కలిగిన అసమాన బలంతోనే పదో రోజున రాక్షసుల్ని మట్టుపెట్టిందని పురాణ కథనం. అమ్మవారు మొదటి రోజున సర్వాలంకృత దుర్గా దేవిగా పూజలందుకుంటుంది.

 శ్లో:- సర్వాలంకార యుక్తాం సకలమబయదాం భక్తనమ్రాం భవానీం | శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్ర దాత్రీమ్||

దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్‌

ప్రసాదం :పులిహోర,గుడాన్నం

పులిహోర తయారీ విధానం:

కావాలసిన పదార్ధాలు :

1. బియ్యం : అరకిలో

2. నూనె : 1 కప్పు

3. చింత పండు గుజ్జు : 1 కప్పు

4. పోపు దినుసులు : అరకప్పు

5. అంటే (ఆవాలు, మినపప్పు, సెనగపప్పు,వేరు సెనగ పప్పులు)

6. ఎండుమిర్చి : నాలుగు

7. కరివేపాకు : మూడు రెమ్మలు

8. పచ్చిమిర్చి : మూడు

​9. పసుపు : 1 టేబుల్ స్పూన్

10. ఉప్పు : సరిపడ

11. ఆవపిండి ముద్ద : 1 టేబుల్ స్పూన్

(కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు)

తయారుచేయు విధానం :

1) ముందుగా అన్నం పొడిపొడిగా వండి ప్లేటు లోకి తీసి చల్లార్చాలి.

2) ఇప్పుడు చింత పండు నానపెట్టి, గుజ్జు తియ్యాలి.

3) దీనిలో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి చీలికలు వేసి స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టాలి. ఇది దగ్గరగా ఉడికి ముద్దలా వస్తుంది దీనిని దించి పక్కన పెట్టాలి.

4) ఇప్పుడు స్టవ్ పై బాండిపెట్టి నూనెపోసి పోపుదినుసులు వేసి వేగాక,ఎండుమిర్చి వేసి వేగిన తరువాత కరివేపాకు వేసి స్టవ్ ఆపాలి.

5) ఇప్పుడు అన్నంలో ఉడకబెట్టిన చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి.

6) అన్నమంతా కలిసిన తరువాత, వేగిన పోపు వేసి అన్నం మొత్తం కలపాలి.

*  అంతే చింతపండు పులిహోర రెడి.



గుడాన్నం తయారీ విధానం:-

కావలసిన పదార్థాలు:-- బియ్యం -- 2 కప్పులు
 వేయించిన పెసరపప్పు -- 1/2 కప్పు 
బెల్లంకోరు -- 4 కప్పులు 
నెయ్యి -- 1కప్పు 
ఏలకుల పొడి -- 1 స్పూన్ 
జీడిపప్పు -- 50 గ్రాములు
 కిస్ మిస్ -- 25 గ్రాములు
 తయారీ విధానం:-- ముందుగా స్టవ్ వెలిగించి, బియ్యం, పెసరపప్పు కలిపి కుక్కర్ లో మెత్తగా ఉడికించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసి మెత్తగా గరిటతో కలుపుతూ స్టవ్ మీద సన్నని మంటపై, ఉడికించితే, బెల్లం అంతా కరిగి మెత్తగా పాకంలాగా వస్తుంది. ఇది ఉడికే లోపున....వేరే స్టవ్ మీద చిన్న పాత్రలో నెయ్యి వేసి, వేడిచేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు దోరగా వేయించి, చక్కర పొంగలిలో వేసి, ఏలకుల పొడి వేసి కలిపి దగ్గరగా అయిన తరవాత, దించుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన తియ్యని గుడాన్నం రెడీ.