శ్రీ కృష్ణ ధర్మరాజ స్వామి ఆలయం, నెల్లూరు
శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి ఆలయం అనగానే ఇదేదో విచిత్రమని అనిపిస్తుంది. నెల్లూరులో వెలసిన ఈ ఆలయం వేలాది మంది భక్తులను ఆకట్టుకొంటున్నది.
ఉత్తరాదిలో మహాభారతంలో కనిపించే పెక్కు పాత్రలకు ఆలయాలు ఉన్నాయి. వాటిలో బీష్మ, దుర్యోధన, శకుని, అశ్వత్థామ, హిడంబి, ఘటోత్కచ ఆలయాలు ప్రముఖమైనవి. మన రాష్ట్రంలో కూడా పాండవులకు, ద్రౌపదికి ఆలయలు ఉన్నాయి.
ద్రౌపది ద్రుపదరాజు కుమార్తె. ధర్మరాజు ధర్మపత్ని. ద్రౌపదిని పూజిస్తే శుభం జరుగుతుందని, కన్యలకు త్వరలో వివాహం జరుగుతుందని స్థానికుల విశ్వాసం.
నెల్లూరులోని శ్రీమత్ ద్రౌపతీ సమేత శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి ఆలయంలో భక్తులు నాగప్రతిష్టలు జరుపుతారు. తలనీలాలు సమర్పిస్తారు, పిల్లలకు చెవులు కుట్టిస్తారు.
ఆలయంలో రోజూ ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ పూజలు, ప్రదర్శనలు, ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనవి: పాండవ జననం, విలువిద్యా ప్రదర్శన, లాక్షా గృహదహనం, హిడింబాసుర వధ, ద్రౌపదీ కల్యాణం వంటివి. వీటితో భక్తులకు, యాత్రికులకు వినోదం కల్పిస్తున్నారు. ఆనందిపజేస్తున్నారు.