పశుపతి నాథుని ఆలయం
శ్లో:వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం
శ్లో:- కర్తా కార్యతా చైవ _ ప్రేరకశ్చానుమోదకః
పుణ్యకార్యెే పాపకార్యే _ ఛత్వార సమభాగినః
తా:- పుణ్యకార్యాలను గానీ, పాప కార్యములను గాని చేయువారు,
ఆ పుణ్య, పాప ఫలములను సంపూర్ణముగా అనుభవింతురు.
పుణ్య,పాప కార్యములకు సేవ చేయువారు, సహకరించు వారు,
సలహాలిచ్చువారు ఆ కార్యములను చేయమని ప్రేరేపించువారు
పై నలుగురూ ఆయా పుణ్య, పాప ఫలములను పాలు పంచు కొందరు.
శ్రీ నందివాడ బాలయోగీశ్వరులు ది. 18-04-1975 వ తేదీన శ్రీ రామ నవమి రోజున తపస్సు చేయడము ప్రారంభించిరి. శ్రీ బాలయోగి వారి దృడనిశ్చయము ఎరిగిన కొందురు భక్తులు వారికి స్థిరమైన ఒక ఆశ్రమము నిర్మించిరి. ఆ ఆశ్రమములో తపస్సు చేయుచున్నారు, భక్తుల కోరికపై ప్రతీ ఏటా మహా శివరాత్రి పర్వదినమున,ఆ మరుసటి రోజు రెండు రోజులు కూడా శ్రీ బాలయోగీశ్వరులవారు తమ దివ్య దర్శన భాగ్యమును భక్తకోటికి ప్రసాదిస్తున్నారు. స్వామి వారి దర్మనార్థమై వచ్చిన భక్త కోటికి ఆ రెండు రోజులు కూడా దాతల సహాయముతో ఉచిత అన్నదానమును ఆశ్రమ ట్రస్టువారు భారీఎత్తున జరిపించుచున్నారు. ఈ అన్నదాన మహాయజ్ఞము ప్రతీ ఏటా నిరాటంకంగా జరుపబడుచున్నది.
శ్రీ దుర్గాభవాని అమ్మవారి ప్రేరణ మరియు అనుగ్రహముతో శ్రీ బాలయోగి ట్రస్టు సభ్యులయినటువంటి శ్రీ మామిడి వేణుగోపాల్ నాయుడు గారు శ్రీ బాలయోగి వారి ఆశ్రమ ప్రాంగణము నందు శ్రీ దుర్గా భవానీ ఆలయయును 2010వ సంవత్సరములో నిర్మాణం కావించిరి నాటినుంచి నిత్య పూజలతో పాటు దసరా శరన్నవరాత్రుల మహొత్సవ కార్యక్రమములను ఆ పదిరోజులు కూడా మహవైభోపేతముగా జరపబడుచున్నవి.
తదుపరి ఒకానొక స్వామి వారు శ్రీ బాలయోగి స్వామి వారికి పాదరస శివలింగం ను బహుమతిగా ఇవ్వడం జరిగింది దీనితో పరమేశ్వరుడు ఇక్కడ వెలయుటకు సంకేతము ఇచ్చినట్లయినది. శ్రీ దుర్గాభవాని అమ్మవారి అనుగ్రహం శ్రీ పరమేశ్వరుని ప్రేరణతో శ్రీ పంచముఖేశ్వర ఆలయ నిర్మాణము జరుపుటకు శ్రీ పరమేశ్వరుని అనుగ్రహము ఆజ్ఞ జరిగినది.శ్రీ పరమేశ్వరుని ఆజ్ఞానుసారము ఆలయ నిర్మాణమునకు శ్రీ స్వామిజీ,ఆశ్రమ ట్రస్టు మరియు శ్రీ స్వామివారి శిష్య బృందము యావన్మంది సంయుక్తముగా పంచముఖేశ్వరుని ఆలయ నిర్మాణమునకు సత్సంకల్పము చేసిరి.
తదుపరి 24-3-2016 తేదీ, వేకువఝూమున 5గం:30 ని"లకు ఆలయ నిర్మాణమునకు వేదవిదులయిన పండితుల ఆధ్వర్యములో శంకుస్థాపన జరిగినది. తదుపరి ఆలయ నిర్మాణ కార్యక్రమమును దాతలు భక్తుల సహాయ సంపత్తితో ప్రారంభించడమైనది.కావున భక్తులైన దాతలెల్లరూ తమతమ శక్తి కొలది ధన,వస్తు,సేవ రూపేణా సహాయ సంపత్తులు అందజేసి పరమేశ్వర ఆలయ నిర్మాణ మహయజ్ఞములో తామెల్లరూ పాలుపంచుకొని ఆ పుణ్యమును పురషార్దమును పొంది పరమేశ్వరుని కృపా కటాక్ష వీక్షణమునకు పాత్రులై తరించగోరుచున్నాము.
సహాయం చేయదలచిన దాతలు ఈ నెంబర్లను సంప్రదించగలరు:-
i.కనకరాజు గారు: +919440074411
ch.వీరన్న గారు: +919700363578
P.సతీష్ : +919492595209,9701733629
paytm number: +917989547344
website: www.srinandivadabalayogiswara.com
whatsapp group link:
https://chat.whatsapp.com/1urr86M8bFjHLxM7u5vmgF
సర్వేజనా సుఖినోభవంతు
లోకా సమస్తా సుఖినోభవంతు
సమస్త సన్మంగలాని భవంతు
ఓం శాంతి శాంతి శాంతిః