ప్రపంచంలోనే అతి ఎత్తైన హనుమాన్ విగ్రహం - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Sunday, 3 September 2017

ప్రపంచంలోనే అతి ఎత్తైన హనుమాన్ విగ్రహం



ప్రపంచంలోనే అతి ఎత్తైన హనుమాన్ విగ్రహం

    
భారీ రూపం, ఎత్తైన విగ్రహం, 135 అడుగుల ఎత్తు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదేనని చెబుతారు.  యాత్రికులు, భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్న ఆ ఆలయమే పరిటాల ఆంజనేయ దేవాలయం. కృష్ఞా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఈ హనుమంతుడి ఎత్తైన విగ్రహం ఉంది. విజయవాడ- హైదరాబాద్ కి వెళ్లే జాతీయ రహదారిలో విజయవాడకు 28 కి.మీ దూరంలో పరిటాల గ్రామం ఉంది. ఈ ఆలయంలో 135 అడుగుల ఎత్తైన స్వామి వారి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహంగా చెబుతారు. కుడి చేతిలో అభయ ముద్ర, ఎడమ చేతిలో గదతో.. మీకు నేనున్నాను అనే అభయముద్ర ఇస్తూ, ఆశ్రిత జన రక్షకుడిగా వెలసిన ఈ ఆంజనేయుడు భక్తజన మందారుడై ఎందరో జన భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే రేణుకా దేవి, సీతా లక్ష్మణ హనుమాన్ సమేత రామచంద్రునికి ఉప ఆలయాలున్నాయి. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో మలయ స్వామి వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. కోటిన్నర రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విగ్రహాన్ని చూడాలంటే తలను పూర్తిగా వెనక్కు వంచి చూడాల్సిందే. ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. యాత్రికులకు మార్గాయాసం ఉపశమించడమే కాక, దుష్ట శక్తుల నుండి రక్షణ కలిగి మానసిక ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం