మంత్ర శక్తికి మహిమ ఉంటుందా ? - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Tuesday, 5 September 2017

demo-image

మంత్ర శక్తికి మహిమ ఉంటుందా ?


మంత్ర శక్తికి మహిమ ఉంటుందా ?
Screenshot_2017-09-05-13-23-25

మనసును ప్రక్షాళనం చేసి, నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు మంత్రాలు. జన్మగత వాసనలతో, మనలను కట్టి పడవేసి, ఆచేతన, సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది. మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తారుు. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తారుు. ఉదాహరణకు ‘హుం’ కారం మనలోని భయాన్ని పారద్రోలుతుంది. ‘రాం’ కారం మనకు శాంతిని కలుగచేస్తుంది.


మంత్రంలో ‘మ’కారం అంటే మననం, మననం అంటే పదేపదే ఉచ్ఛరించడం. ‘త్రం’కారం అంటే త్రాణం, త్రాణం అంటే రక్షించేదని అర్థం, కాబట్టి ‘మంత్రం’ అంటే ఏకా గ్రచిత్తంతో పదేపదే ఉచ్ఛరించే వానిని రక్షించేదని అర్థం.మననం చేయువానిని రక్షించేది మంత్రమని అర్థం. మంత్రత అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఒక బీజం (విత్తనం) పెద్దచెట్టు గా వృద్ధిచెందినట్లు, నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచించ బడింది.మంత్ర వివరణపెై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి. తన హృదయం నుండి అవగతమయ్యే శక్తే మంత్రమనీ, దేవతా దిష్టితమైన ఒకానొక అక్షర రచనా విశేషమే మంత్రమనీ, దేవతా స్వరూపమే మంత్రమనీ, సాధనకు, కార్యసిద్ధికి, ప్రత్యేక ఫలితాలకు ప్రకృతి శాస్త్రాలను అనుసరించి వివిధ ప్రక్రియలలో అభ్యాసమూలమైన సిద్ధిత్వాన్ని కలిగించేదే మంత్రమనీ కొన్ని అక్షరాల ప్రత్యేక ఉచ్ఛారణే మంత్రమనీ, ఒక శబ్దాన్ని యాంత్రికంగా, పారవశ్యం కలిగేంతవరకు పునశ్చరణ పారవశ్యం కలిగేంతవరకు పునశ్చరణ చేయడమే మంత్రమని అంటారు.
ఈ జగత్తు అంతా దెైవానికి ఆధీనమై ఉంది. 

అటువంటి దెైవం మాత్రం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. కాబట్టి శబ్ధరూపం లోనున్న దెైవశక్తి స్వరూపమే మంత్రం, మంత్రాన్ని ధ్యాని స్తున్నప్పుడు ఆ మంత్రం దేవతామూర్తి యొక్క శక్తి సాధకుని లో అణువణువు వ్యాపించి ఉంటుంది. అప్పటివరకు నిబిఢీకృ తమై ఉన్న దెైవికశక్తులు సాధకునికి ఉపయోగపడి జ్ఞానోదయ మవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, మాలిన్యాలు తొలగి, మనస్సు నిశ్చలమై, సచ్చిదానంద స్థితిని పొందుతాడు. అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడిన వే మంత్రాలు. శక్తికి, శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమయిన రీతిలో జరిగే మంత్రో చ్ఛారణ వలన, మంత్రంలోనున్న బీజాక్షరాలలో స్పందన కలి గి, అత్యద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది. యోగసా ధన సఫలీకృతమయ్యేందుకు యోగాశక్తి ఎలా అవసరమో, అదే విధంగా మంత్రసాధన ఫలించేందుకు విశేషమైన మాన సిక ఏకాగ్రత అవసరం. ఈ వాక్‌ శక్తీకరణ కలిగినప్పుడు, మనం కొన్ని సాధారణ శబ్దాలలో నిగూఢమైన అర్థాలను చూడగలం. అవి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సమస్తవిశ్వంతో సంభాషొంచే స్థితికి సాధకుని తీసుకెళ్తాయి.


ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. పండుగ సమయాలో గ్రహణ సమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.


మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా! వాటిని స్థానిక భాషలోకి తర్జుమా చేసుకొని దెైవాన్ని పూజించకూడదా? అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు సమాధానం ఒక్కటే.మంత్రం శబ్దప్రధానమైనది. ధ్వనాత్మక సృష్టిపదార్థం సృష్టి కంటే ముందే పుట్టింది. ఇతర తత్త్వాలకంటే శబ్దతత్త్వం శక్తి వంతమైనది. కాబట్టి మంత్రానికి ఆధారం శబ్దం అయింది. సంస్కృత భాషలోని అక్షరాలలో శబ్దం, అర్థం రెండూ ఉన్నాయి. ఈ అక్షరాల నిర్మాణం వల్ల అనేక మహిమలు కలుగుతాయి. అందుకే మిగతా భాషల కంటే సంస్కృతం ఉతృ్కష్టమైన మంత్ర ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సంస్కృతం మంత్రంలో నుండి ఉద్భవించింది మరి.

మంత్రాలు రెండు రకాలు. 1. దీర్ఘమంత్రాలు, 2. బీజామం
త్రం. మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు (మంత్రాలు) ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూలశబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది. దీర్ఘమంత్రాలు వేదపాఠాల వలె గాన రూపములో ఉంటాయి. వీట్లో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.

గాయత్రీ మంత్రం మూడు పాదములు కలదెై, ఇరవెై నాలుగు అక్షరాలతో, ఇరవెై నాలుగు చంధస్సులెై, ఇరవెై నాలుగు తత్వాలకు సంకేతంగా భాసిస్తోంది. గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలు ఋగ్‌, యజుర్‌, సామవేదాల నుంచి గ్రహించబడి, ‘ఓం’కారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి. ‘గాయత్రీ’ మంత్ర ద్రష్టం అయిన విశ్వామిత్రుడు మంత్రనుష్ఠాన ప్రభావంవల్లజితేంద్రియుడవడమేకాక, రాజర్షీత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతేకాక, ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు. అందుకే చాలా మంది సంధ్యావందనాది సమయాల్లో గాయత్రీ మంత్రమును జపిస్తుంటారు. గాయత్రీ మంత్రాన్నీ ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం.
హ్రస్వబీజమంత్రం మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. దీర్ఘ మంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనలపెై ఆధారపడి ఉంటాయి.

undefined

Contact Form

Name

Email *

Message *