భగవద్గీతను చదివితే ఏంటి? - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Wednesday, 30 August 2017

భగవద్గీతను చదివితే ఏంటి?


భగవద్గీతను చదివితే ఏంటి?(వీడియో)
భగవద్గీత గ్రంథాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికీ ప్రయోజనకరమేనని.. యజ్ఞం చేసిన ఫలమే లభిస్తుందని పురోహితులు అంటున్నారు. అంతేగాకుండా భగవద్గీతను పూజించిన వారికి సమస్త భూమండలాన్ని దానం చేసినంత ఫలితం లభిస్తుంది.
సకల పుణ్య తీర్థాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు.. గీతాగ్రంథం ఉన్న వారి ఇంట భూతప్రేత రోగ బాధలతో సహా దైవిక-దేహిక పీడలు తొలగిపోతాయి.
ఇకపోతే, భగవద్గీతను శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజరూపంలో ఉన్న ఆంజనేయులు విన్నారు. అంతేగాకుండా గీతామహాత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పినట్లు పండితులు అంటున్నారు. యుద్ధ సమయంలో అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పినదేమిటి... ఈ వీడియోలో కొన్ని విశేషాలు...